తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది 31 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామివారి దర్శనానికి వేచి ఉన్నారు. భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు 10 గంటల సమయం పడుతుంది . నిన్న శ్రీవారిని 89,013 మంది భక్తులు దర్శించుకోగా 37,698 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.39 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు వివరించారు.ఇవాళ టీటీడీ పాలక మండలి సమావేశం జరుగనుంది.సమావేశంలో మొత్తం 172 అంశాలను చర్చించేందుకు అజెండాను రూపొందించారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు, స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల జారీ పునరుద్ధరణ, టీటీడీ ఉద్యోగులకు ప్రమాద బీమా, నగదురహిత వైద్య సదుపాయాలపై చర్చించనున్నారు.