వైసీపీ నాయకులు నవరత్నాలపై ప్లీనరీలో ఎందుకు చర్చించలేదని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావు నిలదీశారు. ఆదివారం శ్రీకాకుళం జిల్లా రాజాంలోని తన కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. అవినీతి, అక్రమాలు బయటపడతాయనే నవరత్నాల గురించి ప్లీనరీలో చర్చించలేదని కిమిడి విమర్శించారు. ప్రజలిచ్చిన అధికారాన్ని కక్ష సాధింపులకు, దౌర్జన్యాలకు ఉపయోగిస్తున్నారని మండిపడ్డారు.