బీహార్లోని బిక్రమ్గంజ్ పోలీస్స్టేషన్ పరిధిలో గ్రామంలో శనివారం రాత్రి ఆసక్తికర ఘటన జరిగింది. వర్నా గ్రామానికి చెందిన ఓ యువకుడు తన ప్రియురాలికి ప్రేమ లేఖ ఇచ్చేందుకు వచ్చాడు. అయితే పొరపాటున పక్కింట్లోకి వెళ్లిపోయాడు. ఆ ఇంటి యజమాని కేకలు వేయడంతో పారిపోయి వాటర్ ట్యాంకులో దూరాడు. అతడిని స్థానికులు కనిపెట్టి కర్రలతో చితక్కొట్టారు. చివరికి పక్కింటి అమ్మాయి కోసం వచ్చినట్లు తేలింది.