ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కిచ్చిడి చేప...ధర ఎంతో తెలుసా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 11, 2022, 02:02 PM

లక్ అంటే ఇలా ఉండాలి అన్న రీతిలో ఓ మత్య్సకారుడికి కిచిడి చేప లభించింది. మత్స్యకారుడికి చేప లభించడం పెద్ద విషయం ఏమిటీ అని అనుకొంటున్నారా..? కాని చేపలలో కిచిడి చేప వేరు. దీంతో కోనసీమ జిల్లాలో ఓ మత్స్యకారుడి పంట పండింది. చాలా అరుదుగా లభ్యమయ్యే కచ్చిడి చేప అతడికి చిక్కింది. సఖినేటిపల్లి మండలం అంతర్వేది పల్లిపాలెం మినీ ఫిషింగ్‌ హార్బర్‌లో ఆదివారం మత్స్యకారుల వలకు 23కిలోల ఈ కిచిడీ చేప చిక్కింది. ఈ చేప ఏకంగా రూ.2లక్షల ధరకు వ్యాపారులు కొనుగోలు చేశారు. ఈ చేపకు మార్కెట్‌లో భారీ డిమాండ్ ఉందని.. అందుకే ఎక్కువ ధరకు కొనుగోలు చేసినట్లు మత్స్యకారులు చెబుతున్నారు.


ఈ కచ్చిడి చేప పొట్ట భాగాన్ని మందుల తయారీలో వినియోగిస్తారు. అందుకే ఇంత గిరాకీ ఉంది.. ఈ చేప వలకు చిక్కితే మత్స్యకారులకు కాసుల పంటే. ఆడ, మగ చేపల్లో.. మగ చేపకు భారీ డిమాండ్‌. అందుకే కచ్చిడి చేపను అధిక ధరకు కొనుగోలు చేస్తారు. ఈ చేప దొరికితే వ్యాపారులు అసలు వదలరు.. ఎక్కువ ధరకైనా కొనుగోలు చేస్తారు. ఈ చేప పొట్టలోని తిత్తులు ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. అలాగే సర్జరీ చేశాక కుట్లు వేసే దారాన్ని ఈ చేప గాల్ బ్లాడర్‌తో తయారు చేస్తారని చెబుతున్నారు.


అంతేకాదు ఖరీదైన వైన్‌ తయారీలోనూ చేప శరీర భాగాలను వినియోగిస్తారు. మార్కెట్‌లో భారీ ధర పలుకుతున్న ఈ చేపను ప్రొటోలిసియా డయాకాన్సన్‌ అనే సాంకేతిక నామంతో పిలుస్తారు. కచ్చిడి ఎక్కడా ఓ చోట స్థిరంగా ఉండదు. ఒక చోట నుంచి మరో చోటికి ఎప్పుడూ ప్రయాణిస్తూనే ఉంటుంది. ఈ చేపను సముద్రంలో గోల్డెన్ ఫిష్‌ అని కూడా పిలుస్తారు. ఈ చేప దొరికితే మత్స్యకారులు తమకు బంగారం దొరికనట్టు.. అందుకే మత్స్యకారులు వీటి కోసం వేటాడుతుంటారు. వ్యాపారులు కూడా ఈ చేపను కొనుగోలు చేసేందుకు వస్తుంటారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa