భారీ వర్షాల కారణంగా ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖపట్నం పర్యటన వాయిదా పడింది. ఆటోడ్రైవర్లకు ప్రభుత్వం అందిస్తున్న వాహన మిత్ర నిధులను విడుదల చేసేందుకు ఈ నెల 13న విశాఖపట్నంలో పర్యటించాలని జగన్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో జగన్ పర్యటనను ఈ నెల 15వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం సోమవారం సాయంత్రం ప్రకటించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa