పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయములో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక - స్పందన కార్యక్రమము సోమవారం జరిగింది. ఇందులో పాల్గొని ప్రజల నుండి 48 ఫిర్యాదులను స్వీకరించి,వారి బాధలను ఎస్పీ శ్రీ రవిశంకర్ రెడ్డి ఐపీఎస్ ఆలకించారు. దీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న ఫిర్యాదులపై దృష్టి సారించి,పెండింగ్ లో ఉండటానికి గల కారణాలను తెలుసుకుని, వాటిని పరిష్కరించడానికి కృషి చేయాలని,అవసరమైన చోట వెంటనే కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఎస్పీగారు ఆదేశించారు.