సెల్ ఫోన్లు పోగొట్టుకున్న ప్రజలకు జిల్లా పోలీసుశాఖ రికవరీ చేసిన సెల్ ఫోన్లలో 91 మొబైల్ ఫోన్లను అనంతపురం జిల్లా ఎస్పీ బాధిత ప్రజలకు అందజేశారు. సెల్ ఫోన్ లు పోగొట్టుకున్న బాధిత ప్రజల కోసం జిల్లా పోలీసుశాఖ ప్రారంభించిన " CHAT BOT" సేవలకు కూడా మంచి స్పందన వస్తోందన్నారు. పోలీసు స్టేషన్ కు వెళ్లకుండా FIR నమోదు చేయకుండా కేవలం వాట్సాప్ మేసేజీతో చోరీ/ మిస్ అయిన సెల్ ఫోన్లు అతి తక్కువ సమయంలోనే అందుతుండటంతో బాధిత ప్రజల నుండీ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు 1260 సెల్ ఫోన్లు రికవరీ చేసినట్లు పోలీస్ వారు తెలియజేసారు.