శ్రీకాళహస్తి నియోజకవర్గం, రేణిగుంట మండలం , తారకరామారామానగర్ గ్రామం కి చెందిన 87 సం. ల రాములమ్మ నివసిస్తున్న ఇంటిని వైసిపి నాయకులు కబ్జా చేసి ఇంటి నుండి బయట తరిమేశారని, RDO, MRO, పోలీస్ స్టేషన్ కి వెళ్ళినా న్యాయం జరగలేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని ఆశ్రయించారు. రాములమ్మ కి న్యాయం జరిగే వరకు జనసేన పార్టీ అండగా ఉంటుందని స్థానిక ఎమ్మెల్యే దిగజారుడు మాటలు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడం తగదని, ఎమ్మెల్యే కి దమ్ము, ధైర్యం ఉంటే బహిరంగ చర్చకి రావాలని ఇలాంటి కబ్జాలు, దోపిడీల గురించి ఆధారాలతో జనసేన నిరూపిస్తుంది అని స్థానిక జనసేన నాయకులూ తో కలిసి ఆకేపాటి సుహాసిని తెలియజేయడం జరిగింది.