సాంకేతిక లోపంతో నరసాపురం నుంచి ధర్మవరం వెళ్లే ఎక్స్ప్రెస్ రైలు మంగళవారం మధ్యలో ఆగిపోయింది. ఏపీలోని అన్నమయ్య జిల్లా కురబలకోట, తుమ్మలకుంట ప్రాంతంలో నిలిచిపోయింది. గంటల కొద్దీ రైలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. దీనిపై స్పందించిన అధికారులు మరో ఇంజిన్ను అక్కడకు పంపించారు. రైలును ముందుకు కదిలించే చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై రైల్వే అధికారులు అంతర్గత విచారణ చేపట్టారు.