బక్రీద్ ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనమని, రూ.1,000 కోట్ల వ్యాపారం జరుగుతుందని ఇమామ్ మౌలానా ఖలీద్ రషీద్ చెప్పారు. 20 లక్షల మంది రైతులకు ఉపాధి కల్పిస్తుందన్నారు. వీరి రూపంలో 40 కోట్ల మందికి ఆహార అవసరాలు తీరతాయని చెప్పారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని ఐషాబాద్ ఈద్గా ఇమామ్ మౌలానా ఖలీద్ రషీద్ ముస్లింల్లో చైతన్యం దిశగా కీలక సూచన చేశారు. మసీదులు, శుక్రవారాలు ప్రార్థనల కోసమే కానీ, నిరసన ప్రదర్శనలకు కాదన్నారు. బక్రీద్ సందర్భంగా ముస్లింలను ఉద్దేశించి ఆయన కీలక ప్రసంగం చేశారు. పండుగల సందర్భంగా త్యాగమనే ఆచారం 40 కోట్ల మంది పేదలకు అన్నం పెడుతుందన్నారు. ముస్లింలు అందరూ మొక్కలను నాటాలని, పర్యావరణాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. ప్రతి ముస్లింకి ఆచారంగా మహమ్మద్ ప్రవక్త చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. మసీదులు అనేవి ప్రార్థనా స్థలాలని, వాటికి సమీపంలో ప్రదర్శనలు చేయకూడదని రషీద్ అన్నారు.