బీరుతో ఎన్నో ప్రయోజలున్నాయని ఎవరైనా చెబితే నలువైపులా విమర్శలొస్తాయి. అయితే పోర్చుగల్‌కు చెందిన 'సెంటర్ ఫర్ రీసెర్చ్ ఇన్ హెల్త్ టెక్నాలజీస్ అండ్ సర్వీసెస్' చేపట్టిన తాజా అధ్యయనంలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. బీరు తాగే వారిలో దీర్ఘకాలిక వ్యాధులు తట్టుకునే సామర్థ్యం ఉంటుందని తేలింది. గుండె జబ్బులు, డయాబెటిస్, అధిక బరువు సమస్యలను అరికట్టే బాక్టీరియా ద్వారా ఈ ప్రయోజనాలుంటాయని వారు కనుగొన్నారు.