ఆకాశంలో మరోసారి సూపర్మూన్ కనువిందు చేయనుంది. ఈ నెల 13న చందమామ భూమికి అత్యంత సమీపంలోకి రానుంది. బుధవారం రాత్రి 12.07 గంటలకు ఈ అద్భుతం ఆవిష్కృతం కానుంది. సూపర్ మూన్ కారణంగా సముద్రాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలున్నాయని ఖగోళ శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ సమయంలో సముద్ర ప్రాంతాల్లో తుఫానులు వచ్చి, తీర ప్రాంతాలు వరదలకు దారి తీస్తాయని భావిస్తున్నారు.