కేరళలోని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కార్యాలయంపై మంగళవారం బాంబు దాడి జరిగింది. కన్నూర్ జిల్లా పయ్యన్నూరులో దుండగులు ఈ దాడికి పాల్పడ్డారు. బాంబు వేయడంతో భవనం కిటికీ అద్దాలు దెబ్బతిన్నాయని పోలీసులు వెల్లడించారు. దాడి సమయంలో ఆ కార్యాలయంలోనే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఉన్నారు. అయితే బాంబు దాడి నుంచి వారు ప్రాణాలతో తప్పించుకున్నట్లు తెలుస్తోంది.