మునక్కాయలలోనే కాదు మునగ పువ్వులు, ఆకుల్లో కూడా ఎన్నో పోషకాలుంటాయి. దీనిలో మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం, ప్రొటీన్, విటమిన్ ఎ, సి వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మునగాకుల రసం మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా మేలు చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. అయితే, చక్కెర వ్యాధిగ్రస్తులు మునగాకుల రసాన్నిసేవించడానికి ముందు వైద్యుడిని సంప్రదించడం తప్పనిసరి.