ఎగువ నుంచి వరదనీరు గోదావరిలోకి భారీగా వచ్చి చేరుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వరద ఉద్ధృతి ఎక్కువ కావడంతో రాష్ట్ర విపత్తుల నిర్వహణశాఖ రాజమహేంద్రవరంలోని ధవళేశ్వరం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసింది. ధవళేశ్వరం వద్ద ప్రస్తుతం ఇన్‌ఫ్లో, ఔట్ ఫ్లో 13.02 లక్షల క్యూసెక్కులుగా ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ అంబేడ్కర్ సూచించారు.