ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ అధికారి సత్యనారాయణకు ఏపీ నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ను జారీ చేసింది. విద్యా శాఖకు చెందిన బిల్లుల చెల్లింపులో ఆర్థిక శాఖ ఆలస్యం చేస్తోందంటూ దాఖలైన పిటిషన్పై సోమవారం హైకోర్టులో జరగగా, ఈ విచారణకు హాజరుకావాల్సిన సత్యనారాయణ గైర్హాజరయ్యారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు ఈ నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ను జారీ చేసింది.