సామాజిక ఉద్యమకారుడు, కవి వరవరరావు బెయిల్‌ను సుప్రీంకోర్టు పొడిగించింది. భీమా కోరేగావ్ కేసులో నిందితుడిగా ఉన్న వరవరరావు బెయిల్ పిటిషన్‌పై మంగళవారం సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఇరు పక్షాల న్యాయవాదులు మరింత సమయం కావాలని కోరడంతో విచారణను కోర్టు ఈ నెల 19కి వాయిదా వేసింది. అలాగే, ప్రస్తుతం అనారోగ్య కారణాల రీత్యా ఇంటెరిమ్ బెయిల్‌పై ఉన్న ఆయన బెయిల్‌ను పొడగించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa