అంతర్జాతీయ మార్కెట్ లో మంగళవారం రూపాయి మరింత బలహీనతను ప్రదర్శిస్తూ చరిత్రలోనే అత్యంత కనిష్ఠ స్థాయి 79.57ను నమోదు చేసింది. డాలర్ బలపడడం కూడా రూపాయి బలహీనతకు ఒక కారణం. డాలర్ ఇండెక్స్ 10.8.3కు పెరిగింది. 2002 అక్టోబర్ తర్వాత ఈ స్థాయిని నమోదు చేసింది ఇప్పుడే. యూరో బలహీనపడడం డాలర్ కు బలాన్నిచ్చింది. పెరిగిన ముడి చమురు ధరలతో భారత్ దిగుమతుల కోసం ఎక్కువ మొత్తంలో డాలర్లను వెచ్చించాల్సి వస్తోంది.