కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాకు చెందిన ఓ 15 ఏళ్ల బాలిక రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. ఆ బాలిక బ్రెయిన్ డెడ్ కావడంతో ఆమె తల్లిదండ్రులు బాలిక అవయవాలను దానం చేశారు. బాలిక గుండెను బెళగావిలో ఓ ముస్లిం యువకుడికి అమర్చారు. సోమవారం జీరో ట్రాఫిక్ లో గుండెను తరలించి ఆపరేషన్ చేశారు. బాలిక కాలేయాన్ని మరో వ్యక్తికి, కిడ్నీలను మరో ఇద్దరికి అమర్చారు. ఇలా బాలిక చనిపోతూ నలుగురి ప్రాణాలు కాపాడింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa