రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థిగా బరిలోకి దిగిన ద్రౌపది ముర్ము ఆంధ్రప్రదేశ్ చేరుకున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో తనకు మద్దతివ్వాలని ఏపీకి ప్రజాప్రతినిధులను కోరేందుకు వచ్చిన ముర్ముకు వైసీపీ, బీజేపీ నేతలు గన్నవరం విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికారు. అనంతరం కేంద్రమంత్రి కిషన్రెడ్డితో కలిసి తాడేపల్లిలోని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇంటికి వెళ్లారు.ఈ సందర్భంగా ముర్ముకు ముఖ్యమంత్రి జగన్ ఘనస్వాగతం పలికారు.ఆమెకు వెంకటేశ్వరస్వామి చిత్రాన్ని బహూకరించారు.