రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముక్కు శివసేన మద్దతు ఇస్తుందని శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే మంగళవారం ప్రకటించారు. ఎవరికి మద్దతివ్వాలనే అంశంపై ఉద్ధవ్ సమావేశం నిర్వహించినప్పుడు, 19 మంది ఎంపీలలో 12 మంది ద్రౌపది ముర్ము పేరును ప్రస్తావించారు. ముర్ముకు మద్దతు ఇస్తున్నట్లు ఉద్ధవ్ అధికారికంగా ప్రకటించారు. అయితే ఎంపీలతో జరిగిన సమావేశంలో తనపై ఎవరూ ఒత్తిడి చేయలేదన్నారు.