వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై రఘురాజ్ మండిపడ్డారు. దొంగ కంపెనీలు నడిపే వాడు, సూట్ కేసులు మోసే వాడు తమ పార్టీ జాతీయ కార్యదర్శి అని అన్నారు. ఎవరికి సూట్ కేసులు పంపిస్తున్నాడో అన్ని వివరాలు తన వద్ద ఉన్నాయని తెలిపారు.అందరినీ సూట్ కేసులతో మేనేజ్ చేయచ్చు అనుకోవద్దు అని అన్నారు. ఇకముందు ఆయన సూట్ కేస్ దందాలను ఆపేయాలని అని తెలిపారు.ఎన్నికలను నిర్వహించకుండానే కరుణానిధి శాశ్వత అధ్యక్షుడిగా కొనసాగారనే విషయాన్ని విజయసాయి నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని తెలిపారు. మరి నిరూపించలేకపోతే విజయసాయిరెడ్డి రాజీనామా చేయాలని రఘురామ డిమాండ్ చేశారు.