భారత్‌తో జరుగుతున్న తొలి వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 110 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 6 వికెట్లతో చెలరేగాడు. మహ్మద్ షమీ 3 వికెట్లు, ప్రసాద్ కృష్ణ 1 వికెట్ తీశారు. ఇంగ్లాండ్ జట్టులో బట్లర్ 30 పరుగుల టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రాయ్, జో రూట్, స్టోక్స్, లివింగ్ స్టోన్ డకౌట్ అయ్యారు. ఈ మ్యాచ్‌లో భారత్ గెలవాలంటే 111 పరుగులు చేయాల్సి ఉంది.