ఖర్జూరం పండుతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా గర్భిణులు తరచూ ఖర్జూరం తీసుకుంటే ఐరన్ బాగా లభిస్తుంది. హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్న మహిళలు ఖర్జూరం తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచి జరుగుతుంది. ఖర్జూరం పండులో కాల్షియం, మాంగనీస్, పాస్పరస్ మరియు సెలీనియం వంటివి పుష్కలంగా ఉన్నాయి. ఎముకల బలానికి ఖర్జూరం తింటే ఎంతో మంచిది. జీర్ణశక్తిని ఖర్జూరం మెరుగుపరుస్తుంది.