ఆర్టీసీలో కారుణ్య నియామకాల కోసం ఎదురుచూస్తున్న 896 కుటుంబాలకు ఏపీ సర్కారు గుడ్ న్యూస్ అందించింది. వారికి ఉద్యోగాలు కల్పించే ప్రక్రియకు మంగళవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనిపై రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి ఎమ్టీ కృష్ణబాబు ఆదేశాలిచ్చారు. దీంతో ఆయా కుటుంబాలలో అర్హులైన వారికి గ్రామ, వార్డు సచివాలయాలలో ఉద్యోగాలను పొందనున్నారు. మిగిలిన వారు ఆర్టీసీలో కండక్టర్లుగా, డ్రైవర్లు కొలువు అందుకోనున్నారు.