నాసాకు చెందిన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ తీసిన తొలి చిత్రాన్ని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ విడుదల చేశారు. ఇప్పటివరకు మానవాళి చూడని సుదూరమైన ఇన్ఫ్రారెడ్ చిత్రం ఇదేనని నాసా తెలిపింది. జేమ్స్ టెలిస్కోప్ తీసిన ఫొటోలో చాలా స్టార్స్ ఉండగా ముందువైపు భారీ గెలాక్సీలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద శక్తివంతమైన అంతరిక్ష టెలిస్కోప్గా జేమ్స్ వెబ్ స్పేస్ రికార్డు సృష్టించింది.