ఏపీలోని గుంటూరు జిల్లా బేతంపూడికి చెందిన శివశంకర్ ఏకంగా 11 మందిని పెళ్లి చేసుకున్నాడు. వారి వద్ద నుంచి రూ.లక్షల్లో డబ్బు కాజేసి ఆ తర్వాత వదిలేశాడు. ఇలా ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకుని మోసం చేశాడు.
బాధితుల్లో ఇద్దరు మహిళలు బుధవారం హైదరాబాద్ లో మీడియాకు వివరాలు తెలిపారు. మోసపోయిన వారిలో ఏడుగురు కొండాపూర్ లోనే ఉన్నారని చెప్పారు. శివశంకర్‌ను శిక్షించి, తమకు న్యాయం చేయాలని కోరారు.