జగ్గంపేటనియోజకవర్గం,గండేపల్లి మండలం, నీలాద్రిరావుపేట గ్రామంలో మూడు నెలల క్రితం జనసేన క్రియాశీలక సభ్యుడు ఆచంట సూరిబాబు రోడ్డు ప్రమాదంలో చనిపోవడం వల్ల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంతకంతో కూడుకున్న 5 లక్షల రూపాయలు చెక్కును పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సూరిబాబు కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది. జగ్గంపేట నియోజకవర్గం జనసేనపార్టీ ఇంచార్జ్, పాటంశెట్టి సూర్యచంద్ర మాట్లాడుతూ... ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ నాయకులు అందరికీ కృతజ్ఞతలు సమయం తక్కువ ఉండడం వల్ల అందరికీ ఫోన్ చేయలేకపోయినా ఒక్క మెసేజ్ తో వర్షాన్ని సైతం లెక్కచేయకుండా అందరూ ఎంతో అభిమానంగా వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జగ్గంపేట నియోజకవర్గం జనసైనికులు అందరికీ పేరుపేరునా హృదయపూర్వక అభినందనలు కృతజ్ఞతలు అని తెలియజేసారు.