తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం శ్రీకాళహస్తి ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమం చేపట్టారు. హుండీ లెక్కింపు ద్వారా రూ. 1, 51, 64, 316 ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. 0. 164 గ్రాముల బంగారం, 335. 370 గ్రాముల వెండి, 179 ఫారిన్ కరెన్సీ నోట్లు ఉన్నట్లు ఆలయ ఈవో సాగర్ బాబు, చైర్మన్ అంజు శ్రీనివాసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.