అహర్నిశలు విధుల్లో తలమునకలయ్యే పోలీస్ సిబ్బంది యొక్క ఆరోగ్య పరిరక్షణలో భాగంగా కృష్ణా జిల్లా ఎస్పీ పి జాషువా ఐపీఎస్ ఆదేశాల మేరకు పోలీస్ శాఖ మరియు గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ (ఎన్ఎస్ఎస్) వారి సంయుక్త ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరాన్ని పోలీస్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేయగా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా అడిషనల్ ఎస్పి శ్రీ ఎన్ వెంకట రామాంజనేయులు గారు హాజరై, గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మచిలీపట్నం ప్రిన్సిపల్ శ్రీమతి శ్రీదేవి గారితో కలిసి జ్యోతి ప్రజ్వలన గావించారు. అనంతరం మెడికల్ క్యాంపు నందు ఏర్పాటుచేసిన వైద్య పరీక్షలకు సంబంధించిన కౌంటర్స్ ను పరిశీలించి అక్కడికి విచ్చేసిన వైద్య సిబ్బందితో మాట్లాడారు.