ప్రజారోగ్యాలను పాడు చేస్తున్న నిషేధిత గుట్కా ఉత్పత్తులపై ఉక్కు పాదం మోపుతున్నారు కృష్ణా జిల్లా పోలీసులు. అందులో భాగంగా మచిలీపట్నం సబ్ డివిజన్ పరిధిలోని ఇనకుదురుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 6 లక్షల విలువచేసే నిషేధిత గుట్కా ప్యాకెట్లను, సిగరెట్లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా పోలీస్ వారు మాట్లాడుతూ... జిల్లాలో ఎక్కడ ఇలాంటి నిషేధిత ఉత్పత్తులను తీసుకువచ్చిన , విక్రయించిన కానీ కఠిన శిక్షలకి గురవుతారు అని హెచ్చరించారు.