ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నరసరావుపేట నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ తవ్వకాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 14, 2022, 12:00 PM

పల్నాడు జిల్లా, నరసరావుపేట నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ తవ్వకాలు జరుగుతున్నాయి అని టీడీపీ నాయకులూ ఆరోపించారు. టీడీపీ ఇంచార్జి చదలవాడ అరవింద్ బాబు  మీడియా సమావేశంలో మాట్లాడుతూ......  నియోజకవర్గంలో రెవెన్యూ అధికారులు విధులు నిర్వహిస్తున్నారా లేదా?  అధికార పార్టీ మత్తులో నిద్రపోతున్నారా? పవిత్ర పుణ్యక్షేత్రమైన కోటప్పకొండ దగ్గర యథేచ్ఛగా అక్రమ మట్టితవ్వకాలు జరుగుతుంటే రెవెన్యూ, మైనింగ్ అధికారులు ఏం చేస్తున్నారు? రాత్రి,పగలు తేడా లేకుండా నియోజకవర్గంలో ములకలూరు, పెట్లూరివారిపాలెం, కోటప్పకొండ, విప్పర్లపల్లి, వడ్లమూడివారి పాలెం, అన్నారం, పరగటిచర్ల తదితర గ్రామాల్లో యథేచ్ఛగా మట్టి కొట్టేస్తుంటే రెవిన్యూ,మైనింగ్ అధికారులు అటు వైపుగా కూడా ఎందుకు తొంగికూడా చూడటం లేదు.అటు వైపుగా వెళ్లే సాహసం కూడా రెవిన్యూ, మైనింగ్ అధికారులు ఎందుకు చేయడం లేదు. దీనిలో రెవిన్యూ, మైనింగ్ అధికారుల వాటాలు ఎంతో చెప్పాలి అని ప్రశ్నించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com