పాలలో కాల్షియం ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. అలాగే ఖర్జూరంలో గ్లూకోజ్, ఫ్రక్టోజ్ అధికంగా ఉండి తక్షణ శక్తిని అందిస్తాయి. అదే ఖర్జూరాలను రాత్రిపూట పాలలో నానబెట్టి రోజు ఉదయం వాటిని తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు బోలెడు. గర్భధారణ స్త్రీలు వీటిని తింటే పిండం వృద్ధి చెందుతుంది. అలాగే చర్మంపై వృద్ధాప్య ఛాయలను తొలగిస్తుంది. రక్తహీనతకు ఇది చెక్ పెడుతుంది. రక్తపోటును అదుపులో ఉంచుతుంది. ఎముకలు బలంగా ఉంటాయి.