దళిత యువకుడు ఉదయగిరి నారాయణ హత్యకు నిరసనగా ఛలో నెల్లూరు కార్యక్రమాన్ని తెలుగుదేశం రాష్ట్ర ఎస్సీ సెల్ చేపట్టగా, ఈ కార్యక్రమాన్ని అడ్డుకుంటూ వేలాదిమంది పోలీసులతో నెల్లూరులో భయాందోళన వాతావరణం కల్పించి ఎక్కడికక్కడ దళిత నాయకులను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని అరెస్టు చేస్తున్నారు అని టీడీపీ నాయకులూ ఎంఎస్ రాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...... కచ్చితంగా ఉదయగిరి నారాయణ ని కొట్టి చంపిన ఎస్ఏ కరిముల్లాని సస్పెండ్ చేసేవరకూ ఉదయగిరి నారాయణ కుటుంబంతో మరియు దళిత నాయకులతో నెల్లూరులోని తెల్లకూరి శ్రీనివాస్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో నిరాహార దీక్ష చేపడుతున్నట్లు తెలియజేసారు.