భారత్, అమెరికా, ఇజ్రాయిల్, యూఏఈ దేశాల కూటమి ఐ2యూ2 శిఖరాగ్ర తొలి సమావేశం ఈరోజు జరగనుంది. ఈ సమ్మిట్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్‌గా పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ సమావేశంలో మోడీతో పాటు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఇజ్రాయెల్ ప్రధాని యార్ లపిడ్, యూఏఈ అధ్యక్షుడు మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ పాల్గొననున్నారు. ఐ2యూ2 కూటమిని పశ్చిమ ఆసియాకు క్వాడ్‌గా పిలుస్తారు. గతేడాది ఈ కూటమిని రూపొందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa