మరోసారి అమర్నాథ్ యాత్రను నిలిపివేస్తున్నట్లు ఐటీబీపీ అధికారులు ప్రకటించారు. మళ్లీ భారీ వర్షాలు కురుస్తుండటంతో యాత్రను వర్షాలు తగ్గే వరకు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు తెలిపారు. గురువారం యాత్రకు పహల్గాం, బల్తాల్ మార్గాల ద్వారా వెళ్లే యాత్రికులను నిలిపివేశామని, వర్షాలు తగ్గాక అప్పటి పరిస్థితిని సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. కాగా, ఇప్పటికే 2 సార్లు యాత్రను నిలిపిశారు అధికారులు.