ఓ బాలికపై సముద్ర సింహం దాడి చేయబోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటన అమెరికాలో జరిగింది. రోడ్డు పక్కగా ఉన్న సీ లైన్ పైకి ఓ బాలిక ఎక్కి కూర్చొంది. ఆ చిన్నారి పేరెంట్స్ వీడియో తీస్తున్నారు.
అయితే ఆ సముద్ర సింహం ఒక్కసారిగా వెనక్కి తిరిగి ఆ బాలికపై దాడి చేయబోయింది. దీంతో ఆ చిన్నారి అదుపు తప్పి కిందపడింది. బాలిక తండ్రి వెంటనే ఆమెను పక్కకు తీసుకెళ్లాడు. అయితే ఆ చిన్నారి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన తల్లిదండ్రులపై నెటిజన్లు మండిపడ్డారు.