పాకిస్థాన్‌లో దారుణం ఘటన చోటుచేసుకుంది. ఓ 16 ఏళ్ల హిందూ బాలికను ఓ యువకుడు కిడ్నాప్ చేసి, ఆ తర్వాత బలవంతంగా ఆమె మతం మార్పించాడు. ఆపై వివాహం చేసుకున్నాడు. సింధ్ ప్రావిన్స్‌లోని కాజీ అహ్మద్ నగరంలో వారం రోజుల క్రితం ఈ ఘటన చోటుచేసుకుంది.
విషయం తెలిసిన అక్కడి హిందూ సమాజం, నవాజ్షాలోని పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ నివాసం ఎదుట ఆందోళన తెలిపి, తమకు మద్దతుగా నిలవాలని ఆయనను కోరింది.