దేశంలో మంకీపాక్స్ కలకలం రేగింది. 3 రోజుల క్రితం యూఏఈ నుంచి కేరళ వచ్చిన ప్రయాణికుడిలో మంకీపాక్స్ లక్షణాలున్నట్లు గురువారం ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు. ప్రస్తుతం అతడు అబ్జర్వేషన్లో ఉన్నాడని, వైరస్ లక్షణాలు కనిపించిన తర్వాత శాంపిల్స్ సేకరించి పూణెలోని వైరాలజీ ఇనిస్టిట్యూట్‌కు పంపినట్టు చెప్పారు. ఒకవేళ అతడికి మంకీపాక్స్‌గా నిర్ధారణ అయితే దేశంలో ఇదే తొలి కేసు అవుతుంది.