ముఖ్యమంత్రి జగన్ రేపు అనగా జూలై 15 వ తారీఖు కల్లా రాష్ట్రంలో రోడ్లపై గుంతలు ఉండవు అని హామీ ఇచ్చినట్లు పత్రికల్లో వార్తా కథనాలు వచ్చాయి అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజారపు అచ్చేమ్ నాయుడు గుర్తుచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సాక్షి సంగతి సరే సరి. మూడేళ్ళుగా "అద్దాల్లా మారనున్న రోడ్లు" వంటి కథనాలతో మీ అసమర్థతను కప్పిపుచ్చుతుంది. రేపటికి రాష్ట్రంలో రోడ్లు అన్నీ బాగు చేయించడం మీ వల్ల కాని పని. అందుకే.. అన్నీ వద్దు. కనీసం నేడు పత్రికల్లో వచ్చిన చెత్త రోడ్లకైనా రేపటికల్లా మరమ్మత్తులు చేయగలరా? అని సూటిగా ప్రశ్నిస్తున్నాను. నేటి పత్రికల్లో వచ్చిన చెత్త రోడ్లు కొన్ని మీకోసం ఇక్కడ పెడుతున్నాను. రేపటి లోపు వీటిని బాగు చేయించి ప్రజల ఇబ్బందులు దూరం చేయండి. ఛాలెంజ్ ను స్వీకరిస్తారా? చేతులెత్తేస్తారా? అని ప్రశ్నించారు.