పాక్ లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. భారత్ పొరుగు దేశం అయిన శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం నెలకొంది. అదే విధంగా పాక్ లో కూడా తీవ్ర ఆర్థిక సంక్షోభ పరిస్థితులు ఏర్పడనున్నాయి. ప్రస్తుతం విద్యుత్తు సంక్షోభంతో పాకిస్థాన్ కొట్టుమిట్టాడుతోంది. ద్రవ్యోల్బనం భారీగా పెరగడంతో లీటరు పాల ధర 260 పాకిస్థానీ రూపాయలకు చేరింది. ఆర్థిక కష్టాల నుంచి బయటపడటానికి పాక్ ప్రభుత్వం గాడిదల పెంపకాన్ని ప్రోత్సహిస్తోంది.