మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ మరోసారి పెద్ద మనసును చాటుకున్నాడు. ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సంస్థల్లో ఒకటైన బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ కు 20 బిలియన్ డాలర్లను విరాళంగా బుధవారం ప్రకటించారు. ఈ ఫౌండేషన్ ను తన మాజీ భార్య మిలిందా ఫ్రెంచ్ గేట్స్ తో కలసి ఆయన నిర్వహిస్తున్నారు. ఈ విరాళంతో కలిపి 2026 నాటికి ఈ స్వచ్ఛంద సంస్థ వార్షికంగా చేసే ఖర్చు రూ.70వేల కోట్లు అవుతుంది.