వైసీపీ ప్రభుత్వానికి పేదల ఆకలి కేకలు పట్టడం లేదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ విమర్శించారు. రాష్ట్రంలోని పేదలకు ఉచిత బియ్యాన్ని కేంద్రమే పంపిణీ చేస్తుందని చెప్పారు. కానీ, బియ్యాన్ని తామే పంపిణీ చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకుంటోందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు జగన్ స్టిక్కర్ వేసుకుని తామే అమలు చేస్తున్నట్టు తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు.