ఈ నెల 18 నుంచి జరగబోయే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కొన్ని పదాలను వాడకూడదని లోక్ సభ సెక్రటేరియట్ ఓ బుక్ లెట్ ను బుధవారం విడుదల చేసింది. తాజాగా ఈ నిర్ణయంపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ అభ్యంతరం వ్యక్తంచేశారు. సాధారణ పదాలను కూడా అన్ పార్లమెంటరీ పదాలుగా ఎందుకు పరిగణిస్తారని నిలదీశారు. తాను ఆ పదాలను ఉపయోగిస్తానని, కావాలంటే తనను సస్పెండ్ చేయాలని లోక్ సభ స్పీకర్ కు సవాల్ విసిరారు.