ఆంధ్రప్రదేశ్ లో గత నాలుగు రోజులుగా మున్సిపల్ కార్మికుల సమ్మె కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా దీనిపై మంత్రుల కమిటీ కార్మిక సంఘాల నేతలతో జరిపిన చర్చల వివరాలను సిఎం జగన్ కు వివరించారు.
కార్మికుల హెల్త్ అలవెన్స్ కోసం ఇస్తున్న రూ.6 వేలను కొనసాగిస్తూ కార్మికుల వేతనాన్ని రూ.21 వేలకు పెంచాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయాన్ని మంత్రి సురేశ్ ప్రెస్ మీట్ లో చెప్పారు.