ప్రకాశం జిల్లా బేస్తవారిపేట పట్టణంలో ఎస్సై మాధవరావు గురువారం డ్రంకన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వాహనదారులకు అపరాధ రుసుము విధించారు.
మరల మద్యం తాగి పట్టుపడితే అపరాధ రుసుముతో పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉందని వాహనదారులను ఎస్ఐ మాధవరావు హెచ్చరించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని విజ్ఞప్తి చేశారు. లేదంటే కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు.