ఇవ్వాల్సిన స్థాయిలో కోటా కేంద్రం ఇవ్వడం లేదు. రాష్ట్రంలో 1.45 కోట్ల బియ్యం ఇచ్చే కార్డులు ఉండగా, వాటిలో 88.7 లక్షల కార్డులకు మాత్రమే కేంద్రం సరుకు ఇస్తోంది అని సజ్జల రామకృష్ణ రెడ్డి తెలిపారు. మీడియా తో ఆయన మాట్లాడుతూ... మిగిలిన 56.6 లక్షల కార్డులకు రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా ఇస్తోంది. దీని కోసం ప్రతి నెలా రూ.315 కోట్లు ఖర్చు చేస్తున్నాం. అదే విధంగా సార్టెక్స్ బియ్యం పంపిణీ. అది కూడా డోర్ డెలివరీ. ఈ రెండూ ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు. కోవిడ్ సమయంలో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (పీఎంజీకేవై) గతంలో ఆరు నెలల కోసం ఇచ్చి, పొడిగిస్తూ వస్తున్నారు. దీంట్లో కూడా కేంద్రం గుర్తించిన కార్డులకే ఆ ప్రభుత్వం ఇస్తోండగా, మిగిలిన వాటికి యథావిథిగా ఇస్తున్నాం. దాన్ని 19 నెలలుగా గత ఏప్రిల్ వరకు ఇచ్చాం. నెలకు రూ.300 కోట్లకు పైగా భరించాం. ఇంకా ఇవ్వడం సాధ్యం కాదు కాబట్టి, ఆ మేరకు ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతున్నాం అని తెలియజేసారు.