మోడీ పాలనలో దేశం పరిస్థితి, జగన్ పాలనలో రాష్ట్రం పరిస్థితి నానాటికీ తీసికట్టు నాగంభట్లు అన్నట్లుందనిపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి అన్నారు. మోడీ పాలనలో చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రూపాయి విలువ పతనం అయ్యిందని, కాంగ్రెస్ పాలనలో 2014లో ఒక డాలర్ విలువ రూ. 58 కాగా, నేడు రూ. 79. 89 పైసలు అయ్యిందన్నారు. దీంతో విదేశీ మారక విలువలు కరిగిపోయి శ్రీలంక దుస్థితి భారత్ కు వచ్చే ప్రమాదం ఉందని ఆయన తెలిపారు.