ఏలూరు జిల్లా, ఏలూరు/కుక్కునూరు వరద ముంపు ప్రాంతాల్లో శుక్రవారం జాయింట్ కలెక్టర్ పి. అరుణ్ బాబు, డిఆర్డిఏ పిడి కె. శ్రీనివాసరావు, పంచాయితీరాజ్ ఎస్ఇ చంద్రభాస్కరరెడ్డి పర్యటించారు. స్పీడ్ బోట్లో పర్యటించి వరద పరిస్ధితి పునరావాస కార్యక్రమాలను పరిశీలించారు. కీవాక అర్ అండ్ ఆర్ కాలనీలో పునరావాస కేంద్రాన్ని పరిశీలించారు.
వరద పెరుగుతున్న దృష్ట్యా అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భాదిత కుటుంబాలకు 5 కేజీలు బియ్యం, కెజీ కందిపప్పు అందిస్తున్నామని జాయింట్ కలెక్టర్ చెప్పారు. వరద తగ్గుముఖం పట్టేవరకు పునరావాస కేంద్రాల్లో బాధితులకు భోజనవసతి, సమకూర్చుతున్నట్లు చెప్పారు. భాదితులు ధైర్యంగా ఉండాలని అవసరమైన వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. జిల్లా యంత్రాంగం బాధితులకు అండగా ఉంటుందని ఆయన ధైర్యం చెప్పారు.