ఏలూరు జిల్లా, పోలవరంలో గోదావరి ప్రమాదస్థాయిని దాటి ప్రవహిస్తుంది. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు వద్ద మధ్యాహ్నం మూడు గంటలకు 37.480 మీటర్ల నీటి మట్టం చేరుకుంది.
భద్రాచలం నుంచి 25 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు వస్తుండడంతో పోలవరం వద్ద మరో ఆరు నుంచి ఏడు అడుగుల నీటిమట్టం పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. వరద ఉధృతికి నక్లెస్ బండ్ కోతకు గురవుతున్నాయి.